Tuesday, 24 October 2017

అలజడి

ఏదో చెయ్యమని రెచ్చగొట్టకు 
సరిగంగ స్నానమంది మనసు 
పగటిపూట అలజడి రేపకు 
తుమ్మెద ముట్టని తేనె కోసం 
తుంటరి పెదవులని కదపకు 
దిక్కులు కలవని విరహాలను రేపి
తీరని కోరికలతో గోలపెంచకు
అలలై పొంగిన అందాలతో కైపెక్కించి 
గొంతు ఎండి ఊపిరిని ఆపకు... 

No comments:

Post a Comment