Sunday, 17 September 2017

నీ శక్తి

వేదల్ని తరిమి కొట్టాలనుకో
తలచుకున్నదే తడవుగా 
విధి తలవంచేను చూడు
నీలో ఏముందో నీకే తెలుసు 
వ్యధలకు వత్తాసు పలికితే 
ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు 
నీలో భయాన్ని పొలిమేర దాటించు
నీ శక్తి మేరకు నీవు శ్రమపడు 
నిన్ను నీవు గుర్తించి ముందుకి సాగు..

Thursday, 7 September 2017

నా సాహిత్యం1

జీవితాన్ని ఊహించి
కలగంటే కల్లలు అవుతాయి
కష్టాలను కాలరాసి సాగితే
కొంత సాంతనైన మిగులుతుంది
కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
జీవించే మార్గం చూపుతుంది
ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
మరికొందరికి మార్గదర్శం అవుతాం  
కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..