Thursday, 21 December 2017

నువ్వొక

నువ్వొక ఓ అందమైన అక్షరానివి
ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకానివి
నీ పదాల ఆరాధన
అదే నలుగురికీ ప్రేరణ...
ఎందరి హృదయాల్లో కొలువైతివి
నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి
మాట్లాడకనే సడిచేసె అలల సవ్వడివి
విలువైన వజ్రానివి, వెలుగునిచ్చే జ్యోతివి

అడుగులు

నేను పది అడుగులు వేస్తా
నీవు నాలుగు అడుగులు వేసిరా
అడుగులేగా వేసి వస్తాంటూ 
వగలుచూపి వయ్యారివై నీవు 
అడుగులు వేసి పాదాలు కందనీకు 
ప్రేమ సహకరించినా బిడియం అడ్డుపడు
అయినా సంశయించక అడుగువేయి
నాకు అనుమానమే ...
నీ పాదం కమిలిపోయేనా 
నా అరచేతులనే తివాచీ చేసి 
గగన విహారంలో వివాహమాడెద
మరి ఈ లేచిపోవడాలు 
లేపుకెళడాలు మనకేల ప్రియా... 
ప్రేమా తో...నీ.............. 

Sunday, 10 December 2017

వ్యధ

ప్రతీ మదికి ఒక కధ
దానికి ఎన్నెన్నో వ్యధలు
కధ మారదు వ్యధ తీరదు 
గాయం అయితే నొప్పి
గుండె పగిలితే కన్నీరు వస్తుంది 
జీవితమంటే కష్టం రాకుండా ఉండదు
సుఖం వచ్చి కష్టాన్ని చెరుపుతుంది
అంతవరకూ వేచిచూడక తప్పదు..