Monday, 16 November 2020

పెంచి

 తీయని కోరికలు కలిగించి

దీపాలు చీకటిలో వెలిగించి

తీరని కోరికతో మది రగిలించి

ఆరని వేదనను మాలో పెంచి

అందమైన అక్షరాలతో అలరించి 


Monday, 23 December 2019

ప్రపంచమాయ

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయ నట అంతము వరకు కించిత్ ఆశ తో పెంచెను జగమంతా..

Saturday, 17 November 2018

నా ... నీ

నీ మాటలు వరములై 
హృదయ తలుపులు తడుతుంటే
నీ వాలు చూపులు బాణాలై
నా గుండెను మెలిపెడుతుంటే
నీ ఆశయాలు మలుపులై 
నా గమ్యాన్ని నిర్దేసిస్తుంటే 
నీ నవ్వులు పువ్వులై 
నా మనసులో పరిమళిస్తుంటే
నిన్ను మరవలేని స్థితి
ఏమి దిక్కుతోచని పరిస్థితి
నీకై వేచిచూస్తూ అలసిపొయాను..

Monday, 12 November 2018

సమాజం

కళ్ళు ఉన్న సమాజం
చదివేది మనసును కాదు

మోసం చేసే సమాజం
మానవత్వం చూడదు 

ముప్పుతెచ్చే సమాజం
చెప్పిన మాట వినదు

వెర్రితలల సమాజం
వెక్కిరించడమే చెస్తుంది

వెర్రిబాగుల సమాజం
మంచిని విస్తుపోయి చూస్తుంది 

Friday, 6 July 2018

ఎదలో

రాగాలు తీస్తూనే మైమరచిపోయా
చిరుగాలి తరగలకే చిందులేశాను
ఏటికే నీవింక ఎనలేని హొయలని
వయసు ఊహల్లో నిన్ను నింపాను
న నువ్వు ఎగిరెగి పడుతుంటే
గిలిగింతలతో ఒళ్లు తుళ్లింతపడెను
నీటిలోన నన్ను నేను చూసుకుని
నిను చూచినట్లు మనసు పరుగులెత్తేను 
గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
నీవు లేవన్న ధ్యాసతో నాకు ప్రాణం తీయకే

Thursday, 28 June 2018

నీ నిరాశ

నిరాశ నిస్ప్రహ నిర్లక్ష్యం 
వైఖరి నీలో రేపును అలజడి 
నిరంతరం నిశ్చల నిర్మల ఆలోచనలతో
నిశ్శబ్ద భావాల్ని ప్రకటిస్తూ
అందరితో వాటిని పంచుకుంటూ
ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలను 
తీసుకుని ముందుకు సాగిపోతూ 
నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకో నీవు

Monday, 21 May 2018

వెలుగు

గొంతు దాటి రానీయకు 
గుండెలోని భావాలను
గొంతులోనే త్రుంచేయి 
మనసులోని మాటలను
కంటిలోనే ఇంకిపోనీయి
కన్నీటి శోకాలను 
నవ్వు రాకపోయినా 
విరిసి నవ్వనీ పెదవులను 
వెలుగు లేనిదే 
నీడ కూడా రాదు నీతోను 
కాలం కలసిరానిదే 
అనుకున్నది జరుగదు...